AP: ‘నా మంచి స్నేహితుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ CBNకు ప్రధాని మోదీ విషెస్ తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు ‘X’ వేదికగా స్పందించారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు అంటూ.. ‘X’లో పోస్ట్ చేశారు.