అవినీతి ఆరోపణలపై సాక్ష్యం చెప్పేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోర్టు వెళ్లిన సంగతి తెలిసిందే. తొలిసారి కోర్టుకు చేరిన నెతన్యాహు అక్కడి న్యాయవాదులను నవ్వుతూ పలకరించారు. అనంతరం కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు. ఈ నిజం చెప్పటానికి తాను ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా టెల్ అవీవ్‌లోని భూగర్భ బంకర్లో ఈ విచారణను చేపట్టారు.