ప్రస్తుతం మెగాభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) కాంబినేషన్లో.. ఓ భారీ మల్టీ స్టారర్ ఫిక్స్(multistarrer movie) అయిపోయింది. గతంలో ఈ ఇద్దరు ఎవడు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో కలిసి నటించలేదు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ కాంబో కన్ఫర్మ్ అయింది. అది కూడా అల్లు అరవింద్ లాంటి మెగా ప్రొడ్యూసర్ కోరిక కావడంతో.. చరణ్, అర్జున్ మల్టీ స్టారర్ రావడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం గీతా అర్ట్స్ బ్యానర్లో భారీ చిత్రాలను నిర్మిస్తూ.. అగ్ర స్థానంలో దూసుకుపోతున్నారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. అలాగే ఆహా వంటి ఓటీటీలో సరికొత్త కంటెంట్‌తో అలరిస్తున్నారు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ‘ఫ్యూచర్లో గీతా ఆర్ట్స్ నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చనే క్వశ్చన్‌కు.. చరణ్-బన్నీ కాంబో అంటూ చెప్పుకొచ్చారు. ‘గీతా ఆర్ట్స్‌లో బన్నీ, చరణ్ కలిసి పని చేయడమే తన కోరిక’ అని అన్నారు.
దానికోసం పదేళ్ల క్రితం ‘చరణ్-అర్జున్’ అనే టైటిల్ రిజిష్టర్ చేశానని.. ఇప్పటికీ ఆ టైటిల్‌ను రెన్యూవల్ చేస్తున్నాని.. చెప్పారు. ఇక ఎలాగు టైటిల్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి.. ఎప్పుడుస్తుందో తెలియదు కానీ.. భవిష్యత్తులో ఎప్పటికైనా చరణ్-బన్నీ మల్టీస్టారర్ రావడం పక్కా అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఇద్దరు మెగా హీరోలు పాన్ ఇండియా క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. అలాంటి ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తే.. బాక్సాఫీస్ బద్దలే అని చెప్పొచ్చు.