ఆర్జీకర్ హత్యాచార ఘటనపై సుమోటో కేసు విచారణను 2025 మార్చిలో చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్యులు, వైద్య సిబ్బంది విషయంలో లింగ ఆధారిత హింసను అరికట్టేందుకు, భద్రతా ప్రొటోకాల్ల రూపకల్పన కోసం ‘నేషనల్ టాస్క్ఫోర్స్’కు సూచనలు పంపాలని కోరింది. సెక్యూరిటీ ప్రొటోకాల్స్, ఇతర అంశాల్లో సుప్రీంకోర్టు నియమించిన ‘నేషనల్ టాస్క్ఫోర్స్’.. 12 వారాల్లో నివేదిక ఇస్తుందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు.