SKLM: ఎచ్చెర్ల మండలం కొయ్యి రాళ్లకూడలి వద్ద చెన్నై-కలకత్తా హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి కొబ్బరికాయల లోడుతో వస్తున్న లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని దిండుగల్కు చెందిన లారీ డ్రైవర్ షేక్ షబ్బీర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.