టీ అంటే ఇష్టం ఉన్న వారు రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తాగుతుంటారు. కొందరు స్ట్రాంగ్ టీని ఇష్టపడే వారు కూడా నాలుగు సార్లు తాగుతారు. పాలతో చేసిన టీని ఎక్కువ సమయం మరిగించడం వల్ల శరీరంలో ఐరన్ పోషణకు ఆటంకం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలలో ఉండే విటమిన్ బి12, సి వంటి పోషకాలు క్షీణిస్తాయి. అంతేకాకుండా ఈ టీని ప్రతిసారి తాగడం వల్ల కాలేయం, గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది.