వచ్చే ఏడాది జనవరి 1 నుంచి హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మోడళ్ల కార్ల ధరలు రూ.25 వేలకు పెంచనున్నట్లు వెల్లడించింది. ముడి సరకు వ్యయం, ట్రాన్స్పోర్టు ఛార్జీలు పెరగడం కారణం పెంచాల్సి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి ఈవీ అయానిక్ వరకు రూ.5.92 లక్షల నుంచి రూ.46.05 లక్షల మోడళ్లను హ్యుందాయ్ విక్రయిస్తుంది.