PLD: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:00 గంటలకు వినుకొండ టీడీపీ పార్టీ కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:30 శంకర్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 11:30 గంటలకు ఈపూరులో తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.