JGL: ప్రభుత్వం 4 రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతులతో అనేక విషయాలు తెలుసుకున్నట్లు పెగడపల్లి మండల సర్పంచులు పేర్కొన్నారు. మల్యాల మండలం నూకపల్లి న్యాక్ సెంటర్లో మండలానికి చెందిన సర్పంచులకు గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శనివారం సాయంత్రంతో ముగిశాయి. సర్పంచులు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ పాలన అధికారాలు, విధులు, తెలుసుకున్నామన్నారు.