విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ మూవీని బాలీవుడ్లో షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’ పేరుతో రిమేక్ చేశాడు. తాజాగా ఈ చిత్రంపై షాహిద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అర్జున్ లాంటి అబ్బాయిలు నిజంగానే ఉన్నారని తెలిపాడు. అందుకే సందీప్ రెడ్డి ఆ సినిమా తీసినట్లు వెల్లడించాడు. అలాగే, ఆ సినిమాలో చాలా సన్నివేశాలు తనకు ఇష్టం లేకుండానే నటించినట్లు చెప్పుకొచ్చాడు.