VKB: మోమిన్పేట్ మండలం వెల్చల్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారిని అలంకరించిన రథంపై పురవీధుల్లో ఊరేగించగా, భక్తులు భక్తిపారవశ్యంతో పూజలు నిర్వహించారు. సర్పంచ్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.