సాధారణంగా వంటల్లో నూనెలు వాడుతుంటాం. అయితే కొన్ని రకాల ఆయిల్స్ చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. పల్లీ నూనెలోని విటమిన్-ఇ చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయదు. ఆలివ్ ఆయిల్‌తో మర్దనా చేసుకుంటే చర్మం మెరుస్తుంది. ఆవనూనె.. నిర్జీవమైన చర్మానికి స్వాంతన చేకూరుస్తుంది. కొబ్బరి నూనెలోని పోషకాలు పొడిబారిన చర్మాన్ని మృదువుగా, తాజాగా మారుస్తాయి.
Tags :