నిర్వహణలో లేని, ఫ్రీజ్ అయిపోయిన బ్యాంకు ఖాతాలను తక్షణమే రద్దు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ కోరింది. వచ్చే త్రైమాసికానికి వాటి సంఖ్యను తగ్గించాలని సూచించింది. అలాంటి అకౌంట్లలో పెరుతున్న నగదుపై ఆందోళన వ్యక్తం చేసింది. చాలా బ్యాంకుల్లో పని చేయని, క్లయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య వాటి మొత్తం డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు ఆర్బీఐ కనుగొన్నది.