కామన్ అడ్మిషన్ టెస్ట్-2024కు సంబంధించిన ప్రొవిజనల్ కీ నేడు విడుదల కానుంది. క్యాట్ పరీక్షను ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం 170 నగరాల్లో నవంబర్ 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 3.29 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నేడు విడుదల చేసే కీపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 5 రాత్రి 11:55 వరకు http://iimcat.ac.in ద్వారా ఆన్లైన్లో తెలియజేయాలని సూచించారు. కాగా ఫలితాలు జనవరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.