»Amit Shah Participating In The 54th Cisf Raising Day Parade 2023
54th CISF Raising Day Parade:లో పాల్గొన్న అమిత్ షా
54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) రైజింగ్ డే వేడుకలు హైదరాబాద్‌లో(hyderabad) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై పరేడ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్(hyderabad)లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (NISA)లో ఆదివారం జరిగిన 54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) రైజింగ్ డే పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి(Union Home Minister) అమిత్ షా(Amit Shah) పాల్గొన్నారు. CISF మార్చి 10, 1969న భారత పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి 10న CISF రైజింగ్ డేను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది CISF వార్షిక రైజింగ్ డే వేడుకలు ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అంతకుముందు షా మాట్లాడుతూ CISF భారతదేశ అంతర్గత భద్రతకు ప్రధానమైన వాటిలో సీఐఎస్ఎఫ్ ఒకటని పేర్కొన్నారు.
CISF దేశ రాజధాని న్యూఢిల్లీ వెలుపల(outside Delhi) ‘రైజింగ్ డే’ వేడుకలను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇది ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‌లోని సిఐఎస్ఎఫ్ మైదానంలో జరిగేది. గత ఏడాది ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 53వ రైజింగ్ డే వేడుకకు షా హాజరయ్యారు. గత రెండు సంవత్సరాలుగా అన్ని పారామిలటరీ బలగాలు ఢిల్లీ వెలుపల(outside Delhi) తమ రైజింగ్ డేని జరుపుకుంటున్నాయి. ఒకప్పుడు లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం (LWE) ఆధిపత్యం చెలాయించిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మార్చి 19న CRPF వార్షిక రైజింగ్ డేని నిర్వహించింది.
మార్చి 10న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(pm modi) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందికి వారి రైజింగ్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కీలకమైన ప్రదేశాలలో 24 గంటలపాటు భద్రతను అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. PM మోడీ ఒక ట్వీట్లో భాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అందరికీ వారి దినోత్సవ శుభాకాంక్షలు. మా భద్రతా యంత్రాంగంలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుంది. వారు కీలకమైన, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన ప్రదేశాలలో రాత్రిపూట భద్రతను అందిస్తారని గుర్తు చేశారు.
దీంతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) కూడా CISF సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు సెల్యూట్ చేశారు. భారతదేశంలో క్లిష్టమైన బహిరంగ ప్రదేశాలను సురక్షితం చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశ భద్రత పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు.