జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ భారత్లో విక్రయిస్తున్న తమ వాహనాల ధరలను అన్ని మోడళ్లపై 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. ట్రాన్స్ ఫోర్టు ఛార్జీలతోపాటు నిర్వహణ ఖర్చులను సర్దుబాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా, ఈ ఏడాది జూన్ లో కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను 2 శాతం పెంచిన విషయం తెలిసిందే.