ELR: గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో దివ్యాంగ ఉద్యోగులకు కల్పించే సదుపాయాలన్నీ సెర్ప్ కల్పించాలని రాష్ట్ర సర్ప్ డీఏపీ యూనియన్ నాయకుడు రమణారావు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం వారు విజయవాడలో సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణకు వినతిపత్రం అందజేశారు. సీసీ క్యాడర్లలో పనిచేసే వారికి సొంత మండలాలలో అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నిడమర్రు ఏపీఎం, సీసీలు తదితరులు పాల్గొన్నారు.