గొంగివారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. దివ్యాంగుల లబ్ధిదారుడు రమేష్‌కు ఇంటి వద్దే పింఛన్ అందజేశారు. బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, తాగునీటి సరఫరాపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గ్రామంలో ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు.