భారత్‌లో వివాహాల ఖర్చు ఏటా భారీగా పెరిగిపోతోందని ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ వెడ్‌మీగుడ్ పేర్కొంది. ఈ ఏడాది పెళ్లిళ్ల కోసం ఏకంగా రూ.36.5 లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలిపింది. అంటే సగటున ఒక్కో వివాహానికి రూ.36.5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అదే డెస్టినేషన్ వెడ్డింగ్‌కు అయితే 51.1 లక్షలను కేటాయిస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో జరిగిన పెళ్లిళ్ల ఖర్చుతో పోలిస్తే ఈ సారి 7 శాతం ఎక్కువ ఖర్చని వెల్లడించింది.