పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే ప్రక్రియ ఈజీ చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 2025 జూన్ నాటికి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు డెబిట్ కార్డు తరహా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాన్నట్లు సమాచారం. దీని ద్వారా పీఎఫ్ ఎమౌంట్‌ను ATM నుంచి విత్ డ్రా చేసుకోవచ్చట. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలను పొందేందుకు అధిక పీఎఫ్ కూడా కేంద్రం చెల్లించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.