ADB: అరైవ్ అలైవ్లో భాగంగా జిల్లాలో జరుగు రోడ్డు ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ సమగ్ర కార్యాచరణ చేపట్టినట్లు SP అఖిల్ మహాజన్ శనివారం తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని అన్నారు. ఆ సమయంలో సరైన ప్రథమ చికిత్స అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.