TG: విద్యాకమిషన్పై మాజీమంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు విద్యాకమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి కౌంటర్ ఇచ్చారు. ‘ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించిన మీకు విద్య గురించి మాట్లాడే హక్కు లేదు. కమిషన్ రిపోర్ట్ మీద కాకుండా మా టీం విద్యార్హతల మీద ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మా అర్హతలేంటో మమ్మల్ని అడిగితే ఇచ్చేవాళ్లం. మీ కంటే ఈ సర్కార్ 1000 రెట్లు నయం’ అని అన్నారు.