TG: సికింద్రాబాద్లోని పలు హోటళ్లలో ఫుడ్సెఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రెండు హోటళ్లకు నోటీసులు జారీ చేసింది. ముడి సరుకుల కొనుగోలు, నిల్వ, నాణ్యతకు సంబంధించిన రికార్డులను సరిగ్గా నిర్వహించడం లేదని అధికారులు గుర్తించారు. వంట గదులలో కనీస పరిశుభ్రత పాటించకపోవడం, గడువు ముగిసిన పదార్థాలను వాడటం వంటి అంశాలను పరిశీలించారు.