ఇండియా, ఆస్ట్రేలియాకు ఈ నెల 6న జరగనున్న పింక్ బాల్ టెస్ట్ గురించి సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో మూడు మార్పులు ఉంటాయన్నారు. ‘రోహిత్, గిల్ తుది జట్టులోకి వస్తారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉంటాయి. పడిక్కల్, జురెల్ ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి బయటకు వెళ్తారు. రాహుల్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. వాషింగ్టన్ ప్లేస్లో జడేజా జట్టులోకి వస్తాడు’ అని అభిప్రాయపడ్డాడు.