ప్రపంచ ఆకలీ సూచీ 2022లో భారత్ మరింత దిగజారింది. 101వ స్థానం నుంచి 107వ స్థానానికి పడిపోయింది. 121 దేశాల్లో వివరాలను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ల కంటే ఇండియా వెనుకబడి ఉంది.
మరోవైపు దక్షిణాసియా దేశాల్లో ఆప్గానిస్తాన్ మినహా మిగిలిన దేశాలు భారత్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. ఇక పాకిస్తాన్ 99, శ్రీలంక 64, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81, మయన్మార్ 74వ ర్యాంకుల్లో ఉన్నాయి. ఇండియా కంటే దిగువన ఉన్న వాటిలో జాంబియా, ఆప్గానిస్తాన్, టిమోర్ లెస్టే, గయానా బిసా, సియోర్రా లియోన్, లెసోతో సహా ఇతర దేశాలు ఉన్నాయి.