»Gujarat Assembly Passed A Resolution Against Bbc The Modi Question Documentary
గుజరాత్ అసెంబ్లీ సంచలనం.. BBC Documentaryపై తీర్మానం
టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సప్, ట్విటర్ తదితర సోషల్ మీడియా (Social Media)లో ఈ డాక్యుమెంటరీ లింక్ లను భారత ప్రభుత్వం డిలీట్ చేయించింది. మోదీ దారుణాలు వెలుగులోకి వస్తాయని భావించి ఈ డాక్యుమెంటరీని బయటకు రాకుండా అణచివేసింది.
గుజరాత్ (Gujarat) చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే అత్యంత విషాద సంఘటన గోద్రా అల్లర్లు (Godhra riots). నాడు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) ఉన్న పాలన సమయంలో దారుణాతి దారుణంగా గోద్రా అల్లర్లు చోటుచేసుకుని వేల మంది అమాయకులు బలయ్యారు. మత హింస చోటుచేసుకుని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ విషాద సంఘటనల నుంచి ఆ కుటుంబాలు ఇప్పటికే తేరుకోలేకపోయాయి. అలాంటి దుష్ట సంఘటనపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ (BBC Documentary) డాక్యుమెంటరీ రూపొందించింది. ఆ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ (Gujarat Assembly) తీర్మానం చేసింది. ‘బీబీసీ డాక్యుమెంటరీ కేవలం మోదీకి వ్యతిరేకంగా కాదు. దేశంలోని 135 కోట్ల మంది పౌరులకు వ్యతిరేకంగా ఉంది’ అని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ అసెంబ్లీలో పేర్కొనడం గమనార్హం. గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే మోదీకి మద్దతుగా గుజరాత్ అసెంబ్లీ బీబీసీ డాక్యుమెంటరీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
2002లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ అల్లరి మూకలకు వంత పాడారు. అనేక మంది చావుల (Deaths)కు మోదీ కారణమయ్యాడని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బీబీసీ మోదీ ఫస్ట్ క్వశ్చన్ (The Modi Question Documentary) డాక్యుమెంటరీని రెండు భాగాలుగా రూపొందించింది. రాజకీయంగా మోదీ తొలి అడుగులు మొదలుకుని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరును చూపించింది. ఇందులోనే గోద్రా అల్లర్లను ప్రస్తావించింది. ఆ అల్లర్లను మోదీ ఎలా వాడుకున్నాడో వివరించింది.
కాగా ఆ డాక్యుమెంటరీతో ప్రధాని మోదీ ప్రతిష్టను దిగజారుతుందని.. మోదీ చేసిన దారుణాలు బయటకు వస్తాయనే ఆందోళనతో భారత ప్రభుత్వం భయపడి వెంటనే డాక్యుమెంటరీని నిలిపేసింది.. ఈ డాక్యుమెంటరీ వ్యవహారం అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. బీబీసీ సంస్థపై ఆంక్షలు విధించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాగా అలాంటి డాక్యుమెంటరీపై గుజరాత్ అసెంబ్లీ తీర్మానం చేయడం విస్మయానికి గురి చేస్తోంది.
కాగా ఈ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం (Govt of India) ఉక్కుపాదం మోపుతోంది. భారతదేశంలో ఎక్కడా ఆ డాక్యుమెంటరీ ప్రదర్శితం కాకుండా కఠిన చర్యలు (Restrictions) తీసుకుంది. డాక్యుమెంటరీని ప్రదర్శించిన యూట్యూబ్ చానల్స్ (Youtube Channels) నిషేధించింది. టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సప్, ట్విటర్ తదితర సోషల్ మీడియా (Social Media)లో ఈ డాక్యుమెంటరీ లింక్ లను భారత ప్రభుత్వం డిలీట్ చేయించింది. మోదీ దారుణాలు వెలుగులోకి వస్తాయని భావించి ఈ డాక్యుమెంటరీని బయటకు రాకుండా అణచివేసింది.