నెల్లూరు: 108 విభాగంలో ఖాళీగా ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు జిల్లా మేనేజర్ బాలకృష్ణ తెలిపారు. జీఎన్ఎం, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు సోమవారం సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.