ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా తెలుగు టైటాన్స్- జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. 41-28 పాయింట్ల తేడాతో టైటాన్స్ ఓటమి పాలైంది. దీంతో టైటాన్స్ విజయాలకు మరోసారి బ్రేక్ పడింది. ఇప్పటి వరకు ఆడిన 15 మ్యాచ్‌ల్లో 9 గెలువగా, 6 ఓడిపోయింది.