బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha)కు ఈడీ నోటీసులు పంపడంపై సీఎం కేసీఆర్(CM KCR) ఎట్టకేలకు స్పందించారు. కవిత అరెస్టుకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు కవిత(Kavitha)ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు. ఒక వేళ అరెస్టు చేసుకుంటే చేసుకోనీ అని, అందర్నీ బీజీపీ ఇలానే వేధిస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి భయపడేది లేని, పోరాటం వదిలేది కూడా లేదని సీఎం కేసీఆర్ అన్నారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్(BRS) నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్(BRS) పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్(CM KCR) మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులతో పాటుగా ముఖ్య నేతలపై దాడులు జరిగినట్లు ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు దగ్గరికొస్తుండేకొద్దీ ఇలాంటి దాడులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు.
గతంలో కమలాకర్, రవిచంద్రపై కూడా దాడు చేశారని, ఇప్పుడు ఏకంగా తన బిడ్డ కవిత వరకూ వచ్చారని కేసీఆర్(CM KCR) ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరని వాళ్లను కేసులతో వేధిస్తున్నారన్నారు. కవిత(Kavitha)ను కూడా బీజేపీలో చేరమన్నారని గుర్తు చేశారు. మహా అయితే వాళ్లు ఏం చేస్తారని, జైలుకు మాత్రమే పంపుతారు కదా అని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రేపు కవిత(Kavitha)ను అరుణ్ పిళ్లైతో కలిపి విచారించనున్నట్లు తెలుస్తోంది. అరుణ్ పిళ్లై ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తాను కవిత(Kavitha)కు బినామీనేనని చెప్పారు. పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితకు ఈడీ నోటీసులు అందించింది. ఈ క్రమంలో రేపు ఈడీ విచారణకు కవిత హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో రేపు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.