»R Krishnaiah Demand 56 Percent Reservation Should Be Implemented For Bcs
R Krishnaiah: బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
పార్లమెంటులో బీసీ(BC) బిల్లు(Bill) ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని చట్టసభల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు(reservations) కల్పించాలని కోరారు. బీసీ(BC)లకు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు అంశంపై ఏప్రిల్ 3న ఢిల్లీ(delhi)లో ధర్నా చేయనున్నట్లు చెప్పారు.
పార్లమెంటు(parliament)లో బీసీ బిల్లు(bc bill) ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లోని చట్టసభల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు(reservations) కల్పించాలని కోరారు. బీసీ(BC) వర్గాల ప్రజలకు అనేక విషయాల్లో అన్యాయం జరుగుతుందని తెలిపారు. అందుకోసం ఉద్యమించాలని స్పష్టం చేశారు. మరోవైపు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీల చేతుల్లో లేదన్నారు. అగ్రకులాల చేతుల్లోనే ప్రధాన పార్టీలు ఉన్నట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో దేశంలో ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని ఆరోపించారు. డబ్బులు(money) ఉన్న వారే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
చట్టసభల్లో బీసీలకు ప్రస్తుతం 14 శాతం మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారని ఆర్.కృష్ణయ్య చెప్పారు. మరోవైపు దేశ సంపదలో బీసీ(BC)లదే సంపద ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఇలా అనేక అంశాల్లో ముందు ఉన్న బీసీలకు మాత్రం రాజ్యంగా పరంగా రావాల్సిన అవకాశాలు దక్కడం లేదని గుర్తు చేశారు. బీసీల అభివృద్ధి విషయంలో ప్రశ్నించాల్సిన కుల సంఘాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం బీసీ ప్రధాని(bc pm) ఉన్న క్రమంలో బీసీల సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. దీంతోపాటు బీసీలకు ఓ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు ప్రతి బీసీ ఫ్యామిలీ కోసం రూ.50 లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలన్నారు.
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు అంశంపై ఏప్రిల్ 3న ఢిల్లీ(delhi)లో ధర్నా చేయనున్నట్లు ఆర్.కృష్ణయ్య చెప్పారు. మరోవైపు పార్లమెంటులో బీసీ(BC) బిల్లు గురించి ప్రశ్నించింది వైఎస్సాఆర్సీపీ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు.