no cbi and ed cases:ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) పెద్ద దుమారమే రేపుతోంది. ఒక్కొక్కరినీ సీబీఐ (cbI) అరెస్ట్ చేస్తూ వస్తోంది. రేపు ఈడీ (ed) ఎదుట కల్వకుంట్ల కవిత (kavitha) విచారణకు హాజరుకాబోతున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ (minister ktr) నిన్న మీడియాతో మాట్లాడారు. తన చెల్లి, కవితకు (kavitha) ఇచ్చింది ఈడీ (ed) నోటీసులు కాదు.. మోడీ (modi) నోటీసులు అని చెప్పారు.
సీఎం రమేశ్ (cm ramesh), సుజనా చౌదరి (sujana choudary) తదితర నేతలు సీబీఐ (cbi), కేసుల భయంతో బీజేపీలో చేరారని ఆరోపించారు. బీజేపీలో చేరగానే ఉన్న కేసులు మాఫీ అయ్యాయని పేర్కొన్నారు. మేం దేనికి తలొగ్గం.. విచారణను ఎదుర్కొంటామని మంత్రి కేటీఆర్ (ktr) స్పష్టంచేశారు. కేటీఆర్ కామెంట్లపై సీఎం రమేశ్ (cm ramesh) స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోడీ (modi) విధానాలు నచ్చి బీజేపీలో చేరానని సీఎం రమేశ్ (cm ramesh) తెలిపారు. అంతేకాని తనపై సీబీఐ, ఈడీ కేసులు లేవన్నారు. తనపై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయని నిరూపిస్తే తాము దేనికైనా సిద్దమని ప్రకటించారు. కేసుల మాఫీ కోసమే బీజేపీలో చేరానని మంత్రి కేటీఆర్ (ktr), సీఎం కేసీఆర్ (kcr) మాట్లాడటం తగదన్నారు. చేసిన కామెంట్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి కేటీఆర్ (ktr) కామెంట్లకు సీఎం రమేశ్ (cm ramesh) స్పందించారు. సుజనా చౌదరి రియాక్ట్ కావాల్సి ఉంది. సీఎం రమేశ్, సుజనా చౌదరి.. ఇదివరకు చంద్రబాబు నాయుడుకు (chandra babu naidu) అత్యంత నమ్మకస్తులు.. టీడీపీలో (tdp) ఉండగా కీ రోల్ పోషించారు. 2019 ఎన్నికలకు ముందు వారు టీడీపీకి బై బై చెప్పి.. కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరు మోడీ విధానాలు నచ్చి బీజేపీలో చేరామని ప్రకటించారు. చంద్రబాబును పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇద్దరు నేతల పార్టీ మార్పు అంశం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.