»After Fire Accident First Time Telangana Cm Kcr Visits New Secretariat
KCR ఆ ఘటన తర్వాత తొలిసారి కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్
తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.
తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ (New Secretariat) పనులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K Chandrashekar Rao) పరిశీలించారు. జనవరిలో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన అనంతరం తొలిసారి సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకున్నారు. ఆ ప్రమాదాన్ని మాక్ డ్రిల్ (Mock Drill)గా నమ్మించే ప్రయత్నం చేయగా బెడిసికొట్టింది. తాజా పర్యటనలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కూడా సీఎం పరిశీలించారు. కాగా ప్రారంభ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే తన జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీన సచివాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడిన విషయం తెలిసిందే.
తెలంగాణ కొత్త సచివాలయం (Telangana New Secretariat) భవనం ప్రారంభోత్సవం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ (MLC Election Schedule) వాయిదా పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు నాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 17వ తేదీన తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.