»Madhya Pradesh Congress Party Leader Digvijaya Singhs Car Hits Bike Rider
Rash Driving మాజీ సీఎం కారు బీభత్సం.. ప్రాణపాయ స్థితిలో యువకుడు
అతడికి తీవ్ర గాయాలు కాలేదని, అతడి చికిత్సకు అయ్యే ఖర్చంతా తాను భరిస్తానని మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కాగా బాధితుడికి ప్రాథమిక వైద్యం చేయించి మెరుగైన చికిత్స కోసం భోపాల్ కు తరలించారు.
ముందే సింగిల్ రోడ్డు (Road).. ఆపై గతుకులు ఉన్నాయి. ఈ సమయంలో మెల్లగా వెళ్లాల్సిన వాహనాలు (Vehicles) ర్యాష్ (Rash)గా వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అలాంటి చోట్ల జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంది. కానీ మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వాహనం అత్యంత వేగంగా దూసుకొచ్చింది. ఆ చిన్న రోడ్డుపై యూటర్న్ (U Turn) తీసుకుంటున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ద్విచక్ర వాహనదారుడు (Bike) తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ సంఘటనలో మాజీ సీఎం మానవత్వం చాటుకున్నాడు. ఘటనకు కారణమైన తన డ్రైవర్ (Car Driver) పైనే కేసు నమోదు చేయించాడు. బాధితుడిని దగ్గరుండి ఆస్పత్రికి తరలించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో చోటుచేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh). రాజ్ గడ్ (Rajgarh District) జిల్లాలోని కొడియాకా గ్రామంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి అధ్యక్షుల సమావేశానికి దిగ్విజయ్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. వెళ్తున్న సమయంలో జీరాపూర్ గ్రామానికి చేరుకోగానే అతడి వాహనం ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. వెంటనే స్పందించిన దిగ్విజయ్ సింగ్ వాహనం దిగి బాధితుడిని పరామర్శించారు. గాయాలు కావడంతో కార్యకర్తల సహాయంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వ్యక్తి పరవాలియా ప్రాంతానికి చెందిన రాంబాబు బాగ్రి (20)గా గుర్తించారు. ఆస్పత్రిలో రాంబాబు ఆరోగ్య పరిస్థితిని దిగ్గీ రాజా తెలుసుకున్నారు. అతడికి తీవ్ర గాయాలు కాలేదని, అతడి చికిత్సకు అయ్యే ఖర్చంతా తాను భరిస్తానని మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కాగా బాధితుడికి ప్రాథమిక వైద్యం చేయించి మెరుగైన చికిత్స కోసం భోపాల్ కు తరలించారు. కాగా ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదానికి కారణమైన తన డ్రైవర్ పై దిగ్విజయ్ సింగ్ ఫిర్యాదు చేశారు. అతడిపై కేసు నమోదు చేయించి వెళ్లిపోయారు.