SKLM: మందస మండల పరిధిలో ఉన్న గోపాల సాగర అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష విన్నపం మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసింది. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు గోపాల సాగర పరిసరాలను శనివారం పరిశీలించారు. పట్టణ ప్రజలు సేద తీరేందుకు పార్క్‌తో పాటు పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లకు నిధులు వినియోగిస్తామని తెలిపారు.