SRCL: చందుర్తి మండలం సనుగుల ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సందర్భంగా ఇన్ ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ .. భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ 1928లో కనుగొన్న రామన్ ఎఫెక్ట్‌కు గౌరవంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు.