»Woman Appears For Exams With 4 Daughters In Law In Nalanda
Woman appears for exams: 4గురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసిన అత్త
బీహార్ జిల్లా నలందలో 45 ఏళ్ల శివరతి దేవి అనే మహిళ తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసింది. చదువుకు వయస్సుతో సంబంధం లేదని అమె మరోసారి నిరూపించారు. నాలుగు పదులు దాటినప్పటికీ, ఓ వైపు ఇంటి పనులు చూసుకుంటూ, మరోవైపు కోడళ్లతో కలిసి పరీక్ష రాయడం అందరినీ ఆకర్షించింది.
బీహార్ (Bihar) నలందలో (Nalanda) 45 ఏళ్ల శివరతి దేవి (Sivarati Devi) అనే మహిళ తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసింది (Woman appears for exams with 4 daughters). చదువుకు వయస్సుతో సంబంధం లేదని అమె మరోసారి నిరూపించారు. నాలుగు పదులు దాటినప్పటికీ, ఓ వైపు ఇంటి పనులు చూసుకుంటూ, మరోవైపు కోడళ్లతో కలిసి పరీక్ష రాయడం అందరినీ ఆకర్షించింది. అక్షర్ యోజన అంచల్ యోజన పథకం (Woman appears for exams with 4 daughters-in-law in Nalanda, sets example) కింద మహిళలకు ప్రాథమిక పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తన నలుగురు కోడళ్లు శోభా దేవి, సీమా దేవి, వీనా దేవి, బింది దేవిలతో పాటు శివరతి దేవి కూడా పరీక్షలు రాశారు. పరీక్ష రాయడం కోసం ఆరు నెలల పాటు స్పెషల్ ట్రెయినింగ్ తీసుకున్నది. ఆదివారం పరీక్ష రాసి వార్తల్లో నిలిచింది. ఆమె ప్రతి రోజు ఇంటి పనులు చేయడంతో పాటు లేబర్ వర్క్ చేసుకుంటూ పరీక్షలకు ప్రిపేర్ కావడం గమనార్హం.
బీహార్ లోని నలంద జిల్లా చండీ గ్రామానికి చెందిన ఈ మహిళ చండీ మిడిల్ స్కూల్ లో పరీక్షలు రాసింది. ముఖ్యమంత్రి అక్షర్ యోజన అంచల్ యోజన కింద గ్రామీణ బీహార్ లో వేలాది మందితో పరీక్షలు రాయిస్తున్నారు. ఇందులో శివరతి దేవి, ఆమె కోడళ్లు కూడా ఉన్నారు. వీరిది అకడమిక్ అవేర్ నెస్ లేని చిన్న గ్రామం. ఇక్కడ ఈ ఐదుగురు మహిళలు మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారు. వీరు ఆరు నెలల క్రితం పరీక్షల కోసం ట్రెయినింగ్ తీసుకున్నారు. వారు తమ రోజువారీ పనులు చేసుకుంటూనే… పరీక్షల కోసం సిద్ధమయ్యారు.
పెద్ద కోడలు శోభాదేవి మాట్లాడుతూ… గత ఆరు నెలలుగా తాము చదువు పైన దృష్టి సారించామని, పేర్లు రాయడం, చదవడం నేర్చుకున్నామని చెప్పారు. తాము బేసిక్స్, కూడికలు, తీసివేతలు నేర్చుకున్నట్లు తెలిపారు. ఇది వరకు డాక్యుమెంట్స్ పైన సంతకం అంటే థంబ్ ప్రింట్ ఇచ్చేవారమని, ఇప్పుడు సంతకం చేయడం నేర్చుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ స్కీమ్ ద్వారా చదువు లేని మహిళలు రాణించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
వీరికి చదువు చెప్పిన స్కూల్ టీచర్ రత్నేష్ చౌదరి మాట్లాడుతూ… ప్రతి ఆరు నెలలకు ఈ పరీక్షలు జరుగుతాయని, చాలామంది పరీక్షలు రాస్తుంటారని చెప్పారు. కానీ ఈసారి ఐదుగురు మహిళలు వేర్వేరు వయస్సుల వారు వచ్చారని, అది కూడా ఒకే కుటుంబం నుండి రావడం జరిగిందని చెప్పారు. ఈ ఏడాది 534 మంది మహిళలు పరీక్షలు రాశారని, పదిహేనేళ్ల నుండి 45 ఏళ్ల వరకు మహిళలు ఎవరైనా ఈ పరీక్షల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చునని చెప్పారు. వారికి ఆరు నెలల పాటు ట్రెయినింగ్ ఉంటుందన్నారు. ఈ మహిళలకు తాము బేసిక్స్ చెబుతామని, అక్షరాలు, కూడికలు, తీసివేతలు వంటివి నేర్పుతామని చెప్పారు. మరో ఉపాధ్యాయుడు అవదేశ్ కుమార్ మాట్లాడుతూ… గత ఆరు నెలలుగా ఈ మహిళలు చాలా సిన్సియర్ గా చదువుపై దృష్టి సారించారని చెప్పారు.