వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి మూవీ చేయనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుపై అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలిపాడు. ఇందులో యాక్షన్ ఉంటుందని, ప్రేక్షకులకు తన నుంచి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని చెప్పాడు. 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు మంచి ప్యాకేజ్‌తో రాబోతున్నట్లు తెలిపాడు.