»60 Year Old Woman Dies In Cows Attack At Vadodara
Cows Attack ఘోరం.. ఆవుల దాడిలో వృద్ధురాలు మృతి
ఆవులు (Cow) దాడి చేయడం బహుశా ఏనాడూ చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ బెదిరి తన్నడం వరకు మాత్రమే చూసి ఉంటాం. కానీ ఏకంగా దాడి చేసి ప్రాణం తీసినంత ఘటనలు ఎక్కడా జరిగి ఉండవు. తొలిసారి ఆవుల దాడిలో ఓ వృద్ధురాలు (Old Women) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
ఇన్నాళ్లు కుక్కలు (Dogs), కాకులు (Crow), కోతులు (Monkeys), ఇతర జంతువులు (Animals) దాడి చేసిన సంఘటనలు చూశాం. కానీ ఆవులు (Cow) దాడి చేయడం బహుశా ఏనాడూ చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ బెదిరి తన్నడం వరకు మాత్రమే చూసి ఉంటాం. కానీ ఏకంగా దాడి చేసి ప్రాణం తీసినంత ఘటనలు ఎక్కడా జరిగి ఉండవు. తొలిసారి ఆవుల దాడిలో ఓ వృద్ధురాలు (Old Women) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గోమాతగా పూజించే ఆవులు ఓ వృద్ధురాలిని చంపేసిన దారుణ ఘటన గుజరాత్ (Gujarat)లో జరిగింది. ఇప్పుడు కుక్కల సరసన ఆవులు కూడా చేరిపోయాయి.
వడోదర (Vadodara)లోని మనేజ ప్రాంతంలో ఉన్న సత్యనగర్ హౌసింగ్ సొసైటీలో గంగ చితూ పర్మార్ (60) (Ganga Chhitu Parmar) అనే వృద్ధురాలు ఉంటోంది. ఈనెల 3వ తేదీన బయటకు రాగా ఓ ఆవు ఆమెపై దాడి చేసింది. దాడి చేయడంతో పర్మార్ కింద పడిపోయింది. ఆ తర్వాత మరో రెండు ఆవులు దాడికి పాల్పడ్డాయి. వాటి దాడితో ఆమె లేవలేకపోయింది. ఏకంగా 51 ఆవులు ఒకేసారి దాడి చేసుకుంటూ వెళ్లడంతో స్థానికులు గుర్తించారు. వెంటనే ఆవులను బెదరగొట్టారు. గంగ చిత్తూ పర్మార్ తీవ్ర గాయాలతో కూలబడిపోయింది. కొమ్ములతో ఆమెపై దాడి చేశాయి. అనంతరం కాళ్లతో తన్నుతూ బీభత్సం సృష్టించాయి. కర్ర సహాయంతో నడిచే వృద్ధురాలు ఆవుల దాడులను ప్రతిఘటించలేక నిస్సహాయంగా కూలబడిపోయి తీవ్ర గాయాల బారిన పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వాటిని బెదిరించి పంపిచేశారు. అనంతరం ఆమెను హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (Vadodara Municipal Corporation-VMC)లో కలకలం రేపింది. ఆవుల దాడిలో వృద్ధురాలు మరణించిందనే వార్తతో స్థానికులు భయాందోళన చెందారు.
కాగా ఈ దాడికి సంబంధించి వీడియో (Video) చూడగా ఆ వృద్ధురాలిపై ఒక్కసారి 51 ఆవులు దాడి చేసినట్లు గుర్తించారు. ‘మొదట వృద్ధురాలి వెన్నుపై కొమ్ములతో మూడు ఆవులు దాడి చేశాయి. ఆ తర్వాత మొత్తం 51 ఆవులు దాడికి పాల్పడ్డాయి. ఆ ఆవులు అక్రమంగా నిర్వహిస్తున్న షెడ్ నుంచి వచ్చాయి’ వడోదర మున్సిపల్ అధికారి డాక్టర్ మంగేశ్ జైశ్వాల్ తెలిపాడు. ఈ సంఘటనపై వడోదర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ (VMC Mayor), సయాజీగంజ్ ఎమ్మెల్యేగా ఇటీవల ఎన్నికైన కేయూర్ రొకడియా (Keyur Narayandas Rokadia) స్పందించాడు. ‘ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చాం. పాసా చట్టం కింద చర్యలు తీసుకోవాలని చెప్పాం. ఆవుల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.