W.G: నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతుల ముగిసాయి. గురువారం నిర్వహించిన ముగింపు సభలో బొమ్మిడి నాయకర్ పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్నిపెంపొందించుకోవడం అభినందనీయమని అన్నారు.