అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వివిధ రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠతకు ఆరోగ్య కరమైన ఓటర్ జాబితా అవసరమని అన్నారు.