NTR: ఎన్టీఆర్‌పై హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ ట్వీట్ వైరల్
టాలీవుడ్(Tollywood) మూవీ ఆర్ఆర్ఆర్(RRR) అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. ఆస్కార్(OSCAR) బరిలో ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషనల్(HCA) ఇటీవలె అవార్డులను ప్రకటించింది. పలు విభాగాల్లో ఈ మూవీకి అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల్లో ఎన్టీఆర్(NTR) పేరు లేకపోవడంతో ఫ్యాన్స్ హెచ్సిఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని, అయినప్పటికీ తారక్ కు అవార్డు ఎందుకు ఇవ్వలేదని ట్విట్టర్ వేదికగా అనేక విమర్శలు వెల్లువెత్తాయి.
టాలీవుడ్(Tollywood) మూవీ ఆర్ఆర్ఆర్(RRR) అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. ఆస్కార్(OSCAR) బరిలో ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాకుహాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషనల్(HCA) ఇటీవలె అవార్డులను ప్రకటించింది. పలు విభాగాల్లో ఈ మూవీకి అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల్లో ఎన్టీఆర్(NTR) పేరు లేకపోవడంతో ఫ్యాన్స్ హెచ్సిఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని, అయినప్పటికీ తారక్ కు అవార్డు ఎందుకు ఇవ్వలేదని ట్విట్టర్ వేదికగా అనేక విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ తరుణంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్(HCA) ఎన్టీఆర్ కు కూడా అవార్డు ఇచ్చినట్లుగా ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాకు గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)కు, అలియా భట్‌కు వచ్చేవారం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి అవార్డులు పంపిస్తున్నట్లు వెల్లడించింది. అందరి అభిమానానికి, ప్రేమకు హెచ్సిఏ(HCA) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
వాస్తవానికి ఐదు విభాగాల్లో ఆర్ఆర్ఆర్(RRR) సినిమా అవార్డులను అందుకుంది. ఆ అవార్డు వేడుకలకు దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, సెంథిల్ కుమార్, కార్తికేయ వంటివారు హాజరయ్యారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఎన్టీఆర్(NTR) వెళ్లలేకపోయాడు. ఇక అప్పటి నుంచి హెచ్సిఏ(HCA)పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. దీంతో హాలీవుడ్ క్రిిటిక్స్ అసోసియేషన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తారక్ కు అవార్డును పంపిస్తున్నామని హెచ్‌సీఏ(HCA) ట్విటర్ వేదికగా వివరణ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్(NTR Fans) కూల్ అయ్యారు.