»Hollywood Critics Association Awards 2023 Rrr Movie Photo Gallery
HCA Awards అమెరికాలో RRR బృందం సందడి.. ఫొటోలు
తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా RRR (రౌద్రం, రణం, రుధిరం). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొడుతోంది. ఏ కేటగిరిలోనైనా.. ఏ అవార్డైనా తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం ఆ చిత్ర బృందానికి ఆస్కార్ అవార్డు ఊరిస్తోంది. ‘నాటు నాటు’ (Natu Natu Song) పాట ఆస్కార్ కు నామినేట్ కావడంతో అవార్డు వస్తుందనే గంపెడాశలో భారత చిత్రసీమ ఉంది. అయితే దానికన్నా ముందే RRRకు మరిన్ని అవార్డులు లభిస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ సినిమా వాళ్లు ప్రతిష్టాత్మక భావించే అవార్డుల్లో 5 అవార్డులను మన ఆర్ఆర్ఆర్ కొల్లగొట్టింది. దీంతో మరోసారి ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ వేదికగా మెరిసింది.