MKR: కమ్మర్ పల్లిలో పంచాయతీ ఎన్నికల్లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. చౌటుపల్లికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు చలిని సైతం లెక్కచేయకుండా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె నడవలేని స్థితిలో ఉండటాన్ని గమనించిన ఎన్నికల సిబ్బంది, వెంటనే స్పందించి వీల్ చైర్లో ఆమెను పోలింగ్ బూత్ లోపలికి తీసుకెళ్లారు. ఆమె చైతన్యాన్ని చూసి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.