GNTR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై సీపీఐ నేత జంగాల అజయ్ కుమార్ బుధవారం గుంటూరులో మండిపడ్డారు. పత్తి వంటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టినా పాలకులు పట్టించుకోవడం లేదని వాపోయారు.