NLR: ముత్తుకూరు మండలం బలిజపాలెం సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామాయిల్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి డ్యూటీకి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108 అంబులన్స్కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.