ASR: కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ ఎస్సై కే.శంకరరావు బదిలీ అయ్యారు. ఆయనను అనంతగిరి పోలీసు స్టేషన్కు బదిలీ చేస్తూ అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు 15 నెలల క్రితం ఆయన విశాఖ 2 టౌన్ నుంచి మంప ఎస్సైగా బదిలీపై వచ్చారు. ఏడాదిన్నర కాలంలో ఆయన స్టేషన్ పరిధిలోని మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజలతో మమేకం అయ్యారు.