AP: రాష్ట్రంలో పాలు, నీళ్లు కల్తీ కావడంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలంటూ చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించారు. ‘ఎవరైనా బతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఏపీలో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయి. పలుచోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.