»Dharmapuri Lakshmi Narasimha Temple Brahmotsavams Begins And Ends On Feb 15th
Dharmapuri ధర్మపురి లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
భక్తులకు సరిపడా ఏర్పాట్లు ఉండేందుకు పాలక మండలి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టింది. లడ్డూ ప్రసాదాలు కొరత ఏర్పడకుండా.. దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోనుంది. ఇక ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణలో అటు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అలా ముగిశాయి. ఇలా ధర్మపురి క్షేత్రంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశంలోనే దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం (Dharmapuri Lakshmi Narasimha Temple)లో వార్షిక బ్రహోత్సవాలు (Brahmotsavams) ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో ఉన్న ధర్మపురి ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది. శుక్రవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగనున్నాయి. శుక్రవారం సాయంత్రం వరాహ తీర్థం, పుట్ట బంగారం కార్యక్రమంతో ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో మొదలయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ పాలక మండలి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం లక్ష్మీ నరసింహ మూర్తి కల్యాణం శనివారం జరుగనుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు.
ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా ఏర్పాట్లు ఉండేందుకు పాలక మండలి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టింది. లడ్డూ ప్రసాదాలు కొరత ఏర్పడకుండా.. దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోనుంది. ఇక ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక పూజల అనంతరం వివిధ వాహనాలపై లక్ష్మీ నర్సింహస్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ ల నుంచి ప్రత్యేక బస్సులు వేశారు. ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. గోదావరి (Godavari River) నదీ తీరాన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నదీ పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు.
మార్చి 3న శుక్రవారం: ఉదయం 11 గంటలకు యజ్ణాచార్యుల ఆహ్వానం, వాసుదేవ, పుణ్యాహవచనం, అంకురార్పణ, పుట్ట బంగారం తేవడం.
మార్చి 4న సాయంత్రం 6 గంటలకు స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం
5న సాయంత్రం 7 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు
6న స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ
7న యోగ (పాత) స్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవం
8న ఉగ్ర (కొత్త) స్వామి తెప్పోత్సవం, డోలోత్సవం
9న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం, డోలోత్సవం
10న యోగస్వామి ఉత్తర దిగ్యాత్ర
11న వెంకటేశ్వర స్వామి దక్షిణ, ఉత్తర దిగ్యత్ర
12న రథోత్సవం
13 నుంచి 15 వరకు ఏకాంతోత్సవాలు