AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌కు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో సభలోకి వెళ్లినట్లు ఫొటో, వీడియో చూపించగలరా అంటూ సవాల్ చేశారు. ఈ క్రమంలో చెప్పులు, బూట్లు వేసుకుని సభ లోపల, బయట వైసీపీ సభ్యులు దేవుడి ఫొటో పట్టుకెళ్లిన వీడియోను లోకేష్ విడుదల చేశారు.