KNR: రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్లో ‘బాహుబలి’ మోటార్లు గర్జించాయి. యాసంగి సాగును దృష్టిలో ఉంచుకుని అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసిన నీటిని వరద కాలువ ద్వారా శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.